Feb 27,2021 01:16

25వ వార్డులో ప్రచారం చేస్తున్న టిడిపి అభ్యర్థి రమణ

జివిఎంసి ఎన్నికల నేపథ్యంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపితో పాటు స్వతంత్ర అభ్యర్థులు శుక్రవారం వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
85వ వార్డులో...

అగనంపూడి : జివిఎంసి 85వ వార్డు పరిధి ఆగనంపూడి, శనివాడ ప్రాంతాలలో టిడిపి అభ్యర్థి బలిరెడ్డి పద్మావతి ఇంటింటా ప్రచారం చేశారు. తనను గెలిపిస్తే వార్డు సమస్యలను పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. బలిరెడ్డి నాగేశ్వరరావు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.
14వ వార్డులో..
సీతమ్మధార : 14వ వార్డు వైసిపి కార్పొరేటర్‌ అభ్యర్థి కటారి అనిల్‌ కుమార్‌రాజు శుక్రవారం వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు, ఎఎస్‌ఆర్‌.నగర్‌, పిఎన్‌టి కాలనీ, సీతమ్మధార తదితర ప్రాంతాల్లో ఈ ప్రచారం సాగింది. వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
25వ వార్డులో..
సీతమ్మధార : 25వ వార్డు టిడిపి అభ్యర్థి రమణ శుక్రవారం వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సీతంపేట, గణేష్‌ నగర్‌, మధురనగర్‌ ప్రధాన కూడళ్లలో ఈ ప్రచారం సాగింది. సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. టిడిపి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
44వ వార్డులో..
సీతమ్మధార : 44వ వార్డు టిడిపి కార్పొరేట్‌ అభ్యర్థి కొయిలాడ వెంకటేష్‌ శుక్రవారం వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రజలకు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. శీను బాబు లక్ష్మి, వాసు, శివ, నిర్మల పాల్గొన్నారు.
49వ వార్డులో..
మాధవధార : 49వ వార్డు వైసిపి అభ్యర్థి అల్లు శంకరరావు, ఆయన సతీమణి అల్లు వెంకట సత్య వైసిపి రాష్ట్ర కార్యదర్శి చొక్కాకుల వెంకటరావు, నాయకులు చంద్రశేఖర్‌ యాదవ్‌ ఆధ్వర్యాన బర్మాకాలని, అజరు కలామ్‌ నగర్‌, నెహ్రూ నగర్‌, ప్రగతి నగర్‌, అయ్యప్ప నగర్‌, ఎన్‌జిజిఒఎస్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రచారం చేశారు. సీలింగ్‌ ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. వైసిపి నాయకులు బిఎన్‌.రాజు, రంది పరదేశి నాయుడు, చిరికి వెంటరావు పాల్గొన్నారు.