Jun 02,2023 21:20

ప్రజలతో మాట్లాడుతున్న డిఎంఅండ్‌హెచ్‌ఒ వీరబ్బాయి

           ప్రజాశక్తి-ఆత్మకూరు   ప్రతి ఒక్కరూ వారినికోసారం తప్పనిసరిగా డ్రైడే పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వీరబ్బాయి సూచించారు. శుక్రవారం మండలంలోని పంపనూరు గ్రామ తండాను సందర్శించి దోమల నివారణకు చేపట్టిన మలతీయన్‌ పొడి పిచికారీ, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఇళ్లలో నీటిని నిల్వ ఉంచుకోరాదన్నారు. వారానికి ఒకసారి డ్రైడే పాటించి లార్వా పెరగకుండా చూసుకోవాలన్నారు. అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మలేరియా అధికారి ఓబులు, వైద్యాధికారి దయాకర్‌, ఉప మలేరియా అధికారి సత్యనారాయణ, మలేరియా ఉప విభాగం సూపర్‌వైజర్లు, ఎంపిహెచ్‌ ఇఒ నాగేశ్వరయ్య, మునాఫ్‌, ఎఎన్‌ఎం వెంకటలక్ష్మి, మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు వెన్నెల, తేజేస్విని, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.