Oct 28,2021 07:51

రోమ్‌ : వాతావరణ మార్పులు, ఆరోగ్యం, అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం వంటి మూడు ప్రధాన అంశాలపై త్వరలో జరగబోయే జి 20 దేశాల నేతలు దృష్టి కేంద్రీకరించనున్నట్లు ఇటలీ ప్రధాని మారియో ద్రాగి సహాయకుడు లుయిగి తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విలేకర్లతో ఆయన మాట్లాడారు. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో ఈ నెల 31 నుంచి జరగనున్న ఐరాస 26వ వాతావరణ మార్పుల సదస్సులో వీటి పురోగతిని సమీక్షిస్తామని ఆయన చెప్పారు. కోవిడ్‌ సన్నద్ధతను మెరుగుపరుచు కోవడం, వ్యాక్సిన్ల పంపిణీ వంటి ఆరోగ్య సంబం ధిత అంశాలపెనా చర్చ జరగనున్నట్లు తెలిపారు. ఈ వారాంతంలో జి20 సమావేశం జరగనుంది. కరోనాతో సహా ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాలపై పోరు సల్పడంలో సాయపడేందుకు ఈ సదస్సు ఉద్దేశించబడింది. ఇవి కాకుండా ఫైనాన్స్‌, కార్మిక, విద్య, విదేశీ వ్యవహారాలు, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ఇంధన, సంస్కృతి, వాణిజ్యం, వ్యవసాయం వంటి అంశా లపై మంత్రిత్వస్థాయి చర్చలు జరగనున్నాయి.