Jun 11,2021 21:21

మాట్లాడుతున్న సర్పంచ్‌ సరళి

ప్రజాశక్తి - ముద్దనూరు : వివిధ శాఖల ద్వారా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, వైద్య ఆరోగ్య సేవలను ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సర్పంచ్‌ సరళ అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య పోషకాహార కమిటీ సమావేశం నిర్వహించారు. సర్పంచ్‌ మాట్లాడుతూ ముద్దనూరు మేజర్‌ పంచాయతీలో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్య, పంచాయతీ సిబ్బంది తగిన చర్యలు చేపట్టాలన్నారు. మేజర్‌ పంచాయతీలో అపరిశుభ్రత లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వారంలో ఒక రోజు డ్రైడే పాటించాలన్నారు. పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయించా లన్నారు. కరోనా నివారణకు వ్యాక్సిన్‌పై అపోహలు వీడి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవా లన్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు వరప్రసాద్‌, శోభాకుమారి సిబ్బంది స్వర్ణకుమారి, లలిత, విఆర్‌ సునీత, మహిళా శిశు సంరక్షణ కార్యదర్శి మీనాక్షి, అంగన్వాడీ కార్యకర్తలు భవానిదుర్గ, నాగలక్ష్మి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.