May 09,2021 23:25

కోన రఘుపతి

ప్రజాశక్తి - బాపట్ల : బాపట్లలో వైద్య కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.475 కోట్లకు అదనంగా మరో రూ.30 కోట్లు విడుదల చేసిందని డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి తెలిపారు. ఈ మేరకు ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. జమ్ములపాలెం రహదారిలోని పట్టణ శివారులో 55 ఎకరాలను ఆస్పత్రి నిర్మాణం కోసం కేటాయించగా వైద్య కళాశాలలకు అనుబంధంగా 500 పడకల ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందన్నారు. నిర్మాణం ప్రాంతం నల్లరేగడి నేల కావడంతో కాంక్రీట్‌ పునాదుల్ని మరింత పటిష్టంగా నిర్మించాల్సి ఉందని, అందుకు వ్యవయం పెరిగే అవకాశం ఉందని ఇంజినీరింగ్‌ అధికారులు అంచనాలు రూపొందించగా సిఎం అంగీకరించారని కోన పేర్కొన్నారు.