
ప్రజాశక్తి -విఆర్.పురం : యూమెత ఫౌండేషన్ సౌజన్యంతో ఎంపిటిసి పూనెం ప్రదీప్ కుమార్, లాయర్ మాడివి రవితేజ, ఆదివాసినేత వేక లెనిన్ ఆధ్వర్యాన నిర్వహించి వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తోంది. రెండో రోజు శనివారం మండలంలోని గుర్రంపేట, నూతిగూడెం గ్రామాల్లో నిర్వహించిన మెడికల్ క్యాంపులో దాదాపు 270 మందికి వెద్య సేవలు అందించారు. మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, నాగపూర్ నుంచి నలుగురు డాక్టర్లు వచ్చి ఉచితంగా రోగులకు వైద్యం చేసి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపిటిసి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ వరదలు అనంతరం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అందుకే స్వచ్ఛంద సంస్థలు ద్వారా వరద బాధితులకు వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కారం నగేష్, రాజేష్, పీల్డ్ అసిస్టెంట్ చీలకం శంకర్, గ్రామస్తులు కారం లక్ష్మణరావు, రాజారావు, వాలంటీర్లు, ఆశా వర్కరు బూబమ్మ తదితరులు పాల్గొన్నారు.