Oct 15,2021 00:02

రికార్డులను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌

ప్రజాశక్తి-పిసిపిల్లి : ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాలను మెరుగుపరచాలని సబ్‌కలెక్టర్‌ అపరాజిత సింగ్‌ తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ పథకాల పని తీరుపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. వ్యాక్సిన్‌, లాబొరేటరీ, కాన్పు గదులను పరిశీలి ంచారు. కాన్పు గదులను పరిశుభ్రంగా ఉంచాలని వైద్యురాలు డాక్టర్‌ ఎ.సృజనకు సూచించారు. అనంతరం పిసిపల్లి సచివాలయాన్ని సందర్శించి కంప్యూటర్ల పని తీరును పరిశీలించారు. అదేవిధంగా నేరేడుపల్లి సచివాలయాన్ని పరిశీలించి పంచాయతీ కార్యదర్శి పని తీరుపై ఆరా తీశారు. కార్యదర్శి సెలవుపై వెళ్ళడంతో సెలవు చీటి, వివరాలను పరిశీలించారు. గతంలో రెవెన్యూ అధికారులు ఒకే భూమికి ఇద్దరికి పట్టాలు ఇచ్చిన విషయాన్ని సబ్‌కలెక్టర్‌కు తెలియజేయడంతో సమగ్రమైన సమాచారం ఇవ్వాలని తహశీల్దారు సింగారావును కోరారు. ఈ సమావేశంలో ఎంపిపి అత్యాల జపన్య, జడ్‌పిటిసి పి.లకీëకాంతం, పిసిపల్లి సర్పంచి టి.మరియమ్మ, నాయకులు ఒకేరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు పోలు జయరామిరెడ్డి, బొర్రారెడ్డి, బలసాని మోహన్‌, సర్పంచుల సంఘం మాజీ నాయకులు కేలం సుదర్శనం, ఎంపిడిఒ కె.కుసుమకుమారి, మండల స్థాయి అధికారులు, నాయకులు పాల్గొన్నారు.