Jun 22,2021 20:11

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
ఇచ్చిన హామీలను నెరవేర్చే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అని ఎంఎల్‌ఎ కొట్టు సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని అమ్మ కళ్యాణ మండపంలో మంగళవారం వైఎస్‌ఆర్‌ చేయూత పథకాన్ని ఎంఎల్‌ఎ ప్రారంభించి మాట్లాడారు. నియోజ కవర్గంలో మొత్తం 8,889 మంది లబ్ధిదారులకు రూ.16,66,69,750 చెక్కులను అందజేశారు. మహిళలు ఈ సొమ్మును దుర్వినియోగం చేయకుండా ఉపాధికి వినియోగించుకుని చిరు వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా బలపడాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ బాలస్వామి. ఎంపిడిఒ మల్లికార్జునరావు, కర్రీ భాస్కరరావు, బోలెం రమణ పాల్గొన్నారు.
పెనుమంట్ర:వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా 2,431 మందికి లబ్ధి చేకూరిందని ఎంపిడిఒ ఆర్‌.విజయరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లబ్ధిదారుల ఖాతాలో సొమ్ము జమ చేసినట్లు తెలిపారు.
చింతలపూడి :వైఎస్‌ఆర్‌ చేయూత మహిళలకు వరమని మండల యువత అధ్యక్షులు వెంపా కృష్ణ, గ్రంథలయ ఛైౖర్మన్‌ మిర్యాల దిలీఫ్‌ అన్నారు. పట్టణంలో వైఎస్‌ఆర్‌ చేయూత పథకాన్ని బోయగూడెం సచివాలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బోయగుడెం పరిధిలో 140 మంది మహిళలకు వారి ఖాతాల్లో సొమ్ము జమ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, లబ్ధిదారులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
ఆచంట : మహిళలు ఆర్థికంగా ఎదగడానికి వైఎస్‌ఆర్‌ చేయూత ఎంతగానో ఉపయోగపడుతుందని ఎఎంసి ఛైర్మన్‌ సుంకర ఇందిరా సీతారాం అన్నారు. కొడమంచిలి గ్రామ సచివాలయం వద లబ్ధిదారులతో సర్పంచి సీతారాం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా సీతారాం మాట్లాడారు. నియోజకవర్గంలో 11,712 మంది ఎస్‌సి, ఎస్‌టి, బిసి మైనార్టీ మహిళలకు రూ21.96 కోట్లు నేరుగా మహిళల అకౌంట్లో జమ చేసినట్లు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షురాలు మామిడిశెట్టి కృష్ణవేణి, మాజీ ఎంపిటిసి సభ్యురాలు కొండేటి నీలవేణి, జయలక్ష్మి దానమ్మ, సురేష్‌ రమేష్‌ పాల్గొన్నారు.
భీమవరంరూరల్‌ : మహిళల ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. ఇచ్చిన హామీ మేరకు రెండో ఏడాది కూడా వైఎస్‌ఆర్‌ చేయూత పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ మహిళలకు గతేడాది రూ.20 కోట్ల వరకూ ఆర్ధిక సాయం అందించగా, ఈ ఏడాది మరో రూ.20.3 కోట్ల సొమ్మును 10,687 మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్‌ ఏడుకొండలు, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.శ్యామల, మెప్మా సిఎంఎం మోహన్‌కుమార్‌ పాల్గొన్నారు.
గణపవరం : రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ మహిళలకు ఆర్థికంగా ఆదుకోవడానికి ఏర్పాటుచేసిందే వైఎస్‌ఆర్‌ చేయూత అని ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు తెలిపారు. ఆయన క్యాంపు కార్యాలయంలో చేయూత పథకం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 11,457 మంది లబ్ధిదారులకు 21.48 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశామన్నారు. మహిళ ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ జ్యోతిర్మయి వైసిపి నాయకులు పాల్గొన్నారు.
పాలకొల్లు : వైఎస్‌ఆర్‌ చేయూత సొమ్మును వారి ఖాతాల్లో జమ చేసినట్లు వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కౌరు శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మహిళలకు చెక్కును ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌సి మేకా శేషుబాబు, ఎఎంసి ఛైర్మన్‌ సాల నర్సయ్య, వైసిపి రాష్ట్ర పంచాయతీ రాజ్‌ కార్యదర్శి యడ్ల తాతాజీ పాల్గొన్నారు.
నరసాపురం: నరసాపురం మున్సిపల్‌ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో జరిగే రెండో దఫా వైఎస్‌ఆర్‌ చేయూతను మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ బర్రి శ్రీవెంకటరమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎఎంసి ఛైర్మన్‌ కొల్లాబత్తుల రవికుమార్‌, మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ బర్రి శ్రీ వెంకట రమణ, వైస్‌ ఛైర్మన్‌ కొత్తపల్లి నాని, పట్టణ అధ్యక్షులు బూశారపు జయ ప్రకాష్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశమన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
దేవరపల్లి: మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద వైఎస్‌ఆర్‌ చేయూత పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. నియోజవర్గంలో 13,737 మంది మహిళలకు రూ.25.75 కోట్ల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్‌ జనార్దన్‌రావు, రాష్ట్ర కార్యదర్శి కెవికె దుర్గారావు పాల్గొన్నారు.