Jul 28,2021 18:15

వెర్స‌టైల్ యాక్ట‌ర్ దుల్క‌ర్ స‌ల్మాన్... ‘మహానటి’తో తెలుగువారందరికీ సుపరిచితుడుగా మారాడు. మళ్లీ అదే బేన‌ర్ లో స్వ‌ప్న సినిమా ప‌తాకంపై దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా మ‌రో సినిమా రూపొందుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో లెఫ్ట్‌నెంట్ రామ్‌గా దుల్క‌ర్‌ స‌ల్మాన్ న‌టిస్తున్నారు. సెన్సిబుల్ డైరెక్ట‌ర్ హను రాఘవపూడి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాత అశ్వినిద‌త్ నిర్మిస్తున్నారు.

బుధవారం (జులై28) దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ తాజాగా ఓ గ్లిమ్స్ ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ గ్లిమ్స్‌లో లెఫ్ట్‌నెంట్ రామ్‌గా దుల్క‌ర్ స‌ల్మాన్ ఆక‌ట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  త‌న బ‌ర్త్‌డేకి ప‌ర్‌ఫెక్ట్ గిఫ్ట్ అని దుల్క‌ర్  తెలిపారు.

పీరియ‌డ్ ల‌వ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న సార‌థ్యంలో  కాశ్మీర్‌లోని ప‌లు అంద‌మైన  లోకేష‌న్స్‌లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.
హార్ట్ ట‌చింగ్ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్కించ‌డంలో ప్ర‌సిద్ది చెందిన హను రాఘ‌వ‌పూడి మ‌రో ఆస‌క్తిక‌ర అంశాల‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు.