Jul 29,2021 22:10

ఫైల్‌ ఫొటో వైస్‌ చైర్మన్‌గా డాక్టర్‌ శ్రావణ్‌

ఫైల్‌ ఫొటో వైస్‌ చైర్మన్‌గా డాక్టర్‌ శ్రావణ్‌
వైస్‌ చైర్మన్‌గా డాక్టర్‌ శ్రావణ్‌
నేడు ప్రమాణ స్వీకారం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌:మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా ఆత్మకూరుకు చెందిన అభిరాం ఆసుపత్రి అధినేత డాక్టర్‌ కె.వి శ్రావణ్‌ కుమార్‌ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డాక్టర్‌ కె.వి శ్రావణ్‌ కుమార్‌ పురపాలకలో 21 వ వార్డు నుంచి కౌన్సిలర్‌ గా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ముందు నుంచి ఈయనకే వైస్‌ చైర్మన్‌ పదవి దక్కే అవకాశం మెండుగా ఉన్నా. ఆత్మకూరు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి వర్యులు మేకపాటి గౌతమ్‌ రెడ్డి తీసుకున్న అనూహ్య నిర్ణయంలో డాక్టర్‌ శ్రావణ్‌ తొలి వైస్‌ చైర్మన్‌ పదవి దక్కలేదు. అది ముస్లిం మైనారిటీలకు చెందిన వ్యక్తికి దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం రెండవ వైస్‌ చైర్మన్‌ పదవి నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో డాక్టర్‌ శ్రావణ్‌ కుమార్‌ నియమితులయ్యారు. 30వ తేదీ జరగనున్న పురపాలక సంఘం సర్వసభ్య సమావేశంలో భాగంగా ట్రాక్టర్‌ శ్రావణ్‌ కుమార్‌ పురపాలక ఉపాధ్యక్ష పదవితో పట్టాభిషేకం జరగనుంది. స్వతహాగా సమీప బంధువైన రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఆశీస్సులతో శ్రవణ్‌ కుమార్‌ కు ఈ పదవి దక్కబోతోంది. ఈయనకు ఈ అవకాశం దక్కడంతో మంత్రి అడుగుజాడల్లో పురపాలక సంఘాన్ని ఎన్ని విధాల అభివద్ధి చేసేందుకు కషి చేయనున్నట్లు వెల్లడిస్తున్నారు
ఇప్పటికే ఆయన ఆసుపత్రి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఆయన అభిమానులు , శ్రేయోభిలాషులు, అనుచరగణం, ఎంత ఉత్సాహంతో కోలాహలంగా ఈ వేడుకను చేపట్టేందుకు భారీ స్థాయిలో సన్నద్దం చేస్తున్నారు ఇప్పటికే పలు ప్రాంతాలలో ఆయన అభిమానులు పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన నియోజకవర్గంలో వైద్యపరంగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. అలాగే పురపాలకలో కూడా పురపాలక మంచి అభివద్ధిలో నడిపిస్తారని ప్రజలు ఆశిస్తున్నాను.