
హీరో రామ్ చరణ్ 15వ చిత్రం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు విడుదలకు సంబంధించిన విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి అంటే.. 2023, జనవరి సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఆయన సంస్థలో 50వ చిత్రంగా నిర్మితమవుతోంది. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్గా నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు.