Jan 14,2022 16:41

ఉత్తరప్రదేశ్‌ : ఇక సైకిల్‌ (సమాజ్‌వాదీ గుర్తు)ను ఎవరూ ఆపలేరని అందరూ ఐకమత్యంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో తాము 400 సీట్లు గెలవడం ఖాయమని అఖిలేష్‌ ధీమా వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు సైకిల్‌ హ్యాండిల్‌ బాగుందని, రెండు చక్రాలు కూడా సరిగ్గానే ఉన్నాయని, ఫైడల్‌ తొక్కే వ్యక్తి కూడా వచ్చేశారని వ్యాఖ్యానించారు. బిజెపికి ఇటీవలే గుడ్‌బై చెప్పిన ప్రసాద్‌ స్వామి మౌర్య, ధరంసింగ్‌తో సహా ఇతర బిజెపి ఎమ్మెల్యేలు శుక్రవారం అఖిలేష్‌ సమక్షంలో సమాజ్‌వాదీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అఖిలేష్‌పై వ్యాఖ్యలు చేశారు. యూపీని బిజేపి ప్రభుత్వం మొత్తం దివాళా తీసిందని మండిపడ్డారు. దేశంలో పెట్రో, డీజిల్‌ ధరలతోపాటు నిత్యావసరాలు పెంచుతూ ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు.

యోగికి ఆడటం తెలియట్లేదు .. అఖిలేష్‌ ఎద్దేవా
రోజుకొకరు బిజెపిని వీడి, సమాజ్‌వాదీలో చేరడంపై అఖిలేష్‌ యాదవ్‌ స్పందించారు. రోజుకొకరు బిజెపిని వీడిపోతున్నారని, అయినా ముఖ్యమంత్రి యోగికి ఆట ఆడటం రావడం లేదని ఎద్దేవ చేశారు. ఆట తెలిసీ... ఇప్పుడు క్యాచ్‌ మిస్సయ్యారని విమర్శించారు. తాను ఏ పార్టీలోకి వెళితే, ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని స్వామి మౌర్య అన్నారని, వచ్చేసారి సమాజ్‌వాదీ అధికారంలోకి వస్తుందని అఖిలేష్‌ ధీమా వ్యక్తం చేశారు. నిజానికి సీఎం యోగి ఈ నెల 11న గోఖ్‌పూర్‌కు వెళ్లిపోయారని అఖిలేష్‌ ఎద్దేవా చేశారు.

సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వంలో ఇద్దరు మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరూ బిజెపిపై విరుచుకుపడ్డారు. ఈ మకర సంక్రాంతి తర్వాత బిజెపి పని అయిపోయిందని మాజీ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య విమర్శించారు. ఇప్పటివరకూ కుంభకర్ణుని నిద్రలో ఉన్న పార్టీ ఇప్పుడు మేల్కందని స్వామి మౌర్య ఎద్దేవా చేశారు.