Jun 02,2023 00:14

వధూవరులను ఆశీర్వదిస్తున్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌

ప్రజాశక్తి-మేదరమెట్ల : మండల పరిధిలోని తిమ్మన్నపాలెం గ్రామంలో ప్రజాశక్తి కందుకూరు విలేకరి నాదెళ్ల కోటేశ్వరరావు కుమార్తె ఝన్సీరాణి, అనిల్‌ కుమార్‌ వివాహ వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ వేడుకల్లో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, టిడిపి కందు కూరు నియోజక వర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పూనాటి ఆంజనేయులు, సిపిఎం నెల్లూరు జిల్లా నాయకుడు ముప్పరాజు కోటయ్య, సిపిఎం ప్రకాశం జిల్లా నాయకుడు జివి. కొండారెడ్డి, ప్రజాశక్తి ఒంగోలు బ్యూరో ఇన్‌ఛార్జి ఎస్‌వి. బ్రహ్మం, సర్క్యూలేషన్‌ ఇన్‌ఛార్జి బ్రహ్మయ్య, నెల్లూరు జిల్లా కన్వీనర్‌ కె.కోటేశ్వరరావు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన వధూరులను ఆశీర్వదించిన వారిలో టిడిపి కందుకూరు నియోజక వర్గ నాయకులు, కోరిశపాడు మండల టిడిపి నాయకులు మేదరమెట్ల శ్రీనివాసరావు, బోయపాటి వెంకటేష్‌, రాజేష్‌, బ్రహ్మానందం, అన్నంగి దేవసహాయం ఉన్నారు.