Nov 21,2020 20:53

అమరావతి బ్యూరో: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ (ఆర్‌జియుకెటి)ల్లో ట్రిపుల్‌ ఐటి ప్రవేశ పరీక్ష హాల్‌ టికెట్లు ఆదివారం నుంచి అందుబాటులో రానున్నాయి. ఉదయం పది గంటల నుంచి విద్యార్థులు www.rgukt.in వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ నెల 28న జరగనున్న పరీక్షకు 16వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. మొత్తం 88,972 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 638 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌ నగర్‌, నల్గండ, నిజామాబాద్‌, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో పరీక్ష కేంద్రాన్ని కేటాయించింది.

జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు, పరీక్ష కేంద్రాల వివరాలు

వ. స జిల్లా పేరు పరీక్ష దరఖాస్తు
కేంద్రాల సంఖ్య సంఖ్య
1. శ్రీకాకుళం 60 6,785
2. విజయనగరం 46 4958
3. విశాఖపట్నం 41 5849
4. తూ.గోదావరి 59 8064
5. ప.గోదావరి 27 4182
6. కృష్ణా 42 6456
7. గుంటూరు 45 6864
8. ప్రకాశం 59 7302
9. నెల్లూరు 35 4274
10. చిత్తూరు 48 6563
11. కడప 67 9440
12. అనంతపురం 55 8268
13 కర్నూలు 46 7612