Jun 21,2021 20:12

తణుకు:ఆన్‌లైన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో మైనర్‌ బాలికను వేధించిన కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టుచేశారు. సోమవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో సిఐ డిఎస్‌ చైతన్యకృష్ణ వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలానికి చెందిన గొలుగురి జయరాంరెడ్డి, గొలుగురి జగన్మోహన్‌రెడ్డిని అరెస్టుచేసినట్లు చెప్పారు. వీరిద్దరు ప్రస్తుతం రాజమండ్రిలోని మహాలక్ష్మీ అపార్టమెంట్‌లో నివాసం ఉంటున్నారు. జయరాంరెడ్డి చెల్లెలి స్నేహితురాలైన తణుకు పట్టణానికి చెందిన బాలికకు ఇన్‌ స్టాగ్రామ్‌లో మెసెజ్‌లు పెట్టి ప్రేమించమని వేధిస్తున్నట్లు తెలిపారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి జయరాంరెడ్డిని అతనికి సహకరించిన జగన్మోహన్‌రెడ్డిని అరెస్టుచేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు సిఐ చెప్పారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్‌ఐ కొప్పిశెట్టి గంగాధర్‌రావు, ఎఎస్‌ఐలు పోలయ్యకాపు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.