
మనేపల్లి, ముటుకుల రహదారికి మరమ్మతులు
ప్రజాశక్తి-యర్రగొండపాలెం - రాష్ట్ర పురపాలక పట్టణాభివద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆదేశాలతో పుల్లలచెరువు మండలం మనేపల్లి, ముటుకుల రోడ్డుకు మరమ్మతుల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. గత కొన్నేళ్లుగా ఆ రహదారికి మరమ్మతులు చేయకపోవడంతో తారంతా లేచిపోయి గుంతలు, పడి ప్రయాణానికి తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని మంత్రి సురేష్ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఆయన మరమ్మతులు నిర్వహించి తిరిగి తారు రోడ్డు నిర్మించాలని ఆదేశించారు. అందులో భాగంగా అధికారులు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. రోడ్డుపై పడిన గుంతలు పూడ్పించి మరమ్మతులు చేయించారు. తిరిగి తారు పోసి కొత్త రోడ్డులా సిద్ధం చేశారు.