Jul 29,2021 19:35

రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'రామారావు ఆన్‌ డ్యూటీ'. ఈ మూవీతో సీనియర్‌ నటుడు వేణు తొట్టెంపూడి రీఎంట్రీ ఇస్తున్నాడు. శరత్‌ మండవ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దివ్యాన్ష కౌశిక్‌, రాజేష్‌ విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా 'వెల్కమ్‌ ఎ బోర్డ్‌ వేణు' అంటూ ఓ పోస్టర్‌ను పోస్ట్‌ చేశారు. 1999లో 'స్వయంవరం' సినిమాతో హీరోగా పరిచయమైన వేణు మొదటి సినిమాతోనే నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డును అందుకున్నాడు. ఆ తరువాత 26 సినిమాల్లో నటించాడు. ఇప్పుడు 'రామారావు ఆన్‌ డ్యూటీ' సినిమాతో వేణు రీఎంట్రీ ఇస్తున్నాడు.