
ప్రజాశక్తి-ఐ.పోలవరం
విద్యార్థులు వేసవి వినోదం కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని బాలోత్సవం చిల్డ్రన్ క్లబ్ జిల్లా కో-కన్వీనర్ ఎన్. అబ్బులు అన్నారు. రాష్ట్ర జన విజ్ఞానవేదిక, యుటిఎఫ్- ఐద్వా ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి ఈ నెల 31వ తేదీ వరకు బాలోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్బంగా ఆదివారం ఐ.పోలవరం గ్రామ పంచాయతీలు పరిధిలో ఉన్న నందులవారి మెరక-మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రతి రోజు ఉదయం 8 గంటలకు నుంచి 10 గంటల వరకు సిఐటియు మండల కార్యదర్శి కె.నాగ లక్ష్మి ప్రోత్సాహంతో చదువుతున్న విద్యార్థులకు ఆట, పాటలతో వేసవి వినోద కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ఓరిగామి టీచర్ బి.వెంకటేశ్వర్లు, పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్ బి.వీర్రాజు పాల్గొన్నారు. ఆత్రేయపురం వేసవి విజ్ఞాన శిబిరాల్లో భాగంగా ఆత్రేయపురం శాఖా గ్రంథాలయం లో ఆదివారం విద్యార్థులకు ఉపాధ్యా యులు చిప్పాడ సత్యనారాయణ చిత్రలేఖనంపై శిక్షణ ఇచ్చారు శిబిరములో వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొ న్నారు. గ్రంథాల యానికి జిల్లా గ్రంథాలయ సంస్థ సరఫరా చేసిన నీతి కథలు, తెలుగు, ఇంగ్లిష్ పుస్తకాలు విద్యార్థులు చదివారు. ఈ సందర్భంగా చేతి రాత అందముగా ఉండుటకు మెళకువలు తెలియజేశారు. గ్రంథాలయ అధికారి తమ్మ నమశ్శివాయ మాట్లాడుతూ వేసవి విజ్ఞాన శిబిరాల్లో విద్యార్థులు అందరూ పాల్గొనా లన్నారు. ఈ శిబిరాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అందరికీ ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు. గ్రంథాలయంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ర్యాలీ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు చింతా శ్యామ్ కుమార్ తన ఇంటిలో గ్రంథాలయం ను ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్వహిస్తున్న చదువంటే నాకిష్టం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ తన పాఠశాల్లోని విద్యార్థులతో పాటు గ్రామం లో వున్న అందరి చిన్నారులకు అందుబాటులో సుమారు 500 పుస్తకాలు అందుబాటులో ఉంచి కథలు చెప్పడం, రాయడం, డ్రాయింగ్, డ్యాన్స్, వంటి వాటిలో శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం చిన్నారులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించి ప్రతిభ గల చిన్నారులకు బహుమతులు అందజేశారు.