Jul 29,2021 16:10

ప్రజాశక్తి-మండపేట : వేతన బకాయిలు, ఉద్యోగ భద్రత కోసం స్థానిక పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఉద్యోగులు గురువారం విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ కరోనా నేపధ్యంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలందించామని తమ సేవలను గుర్తించకపోగా గత ఆరు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. దీంతో కుటుంబం నడవడం కష్టతరంగా మారిందన్నారు. గత నెల ఎనిమిది తేది నుంచి వేతనాల కోసం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపినప్పటికి అటు యాజమాన్యం ఇటు ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఇప్పటికైన వేతన బకాయిలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు.