Jan 19,2022 16:34

శీతాకాలంలో సాధారణంగా చన్నీటి స్నానం చేయడం చాలా కష్టం. అలాంటిది తెల్లవారుఝామున ఎముకలు కొరికే చలిలో నదిలోనో, చెరువులోనో చన్నీటి స్నానం చేయాల్సి వస్తే.. ఆ వ్యక్తి పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. అయితే ఓ వ్యక్తి మాత్రం చిన్న ట్రిక్‌ను ఉపయోగించి చన్నీటి స్నానం చేశారు. అసలు విషయంలోకి వెళితే.. ఆ వీడియోలో ఓ వ్యక్తి నది లేదా చెరువులో స్నానం చేసేటప్పుడు చలికి గజగజా వణికిపోతుంటాడు. అయితే ఆ వ్యక్తి చలి నుంచి తప్పించుకునేందుకు ఒక పెద్ద ప్లేటులో చలిమంట ఏర్పాటు చేసుకున్నాడు. నీటిలో నుంచి లేవగానే.. ఎదురుగా ఉన్న ప్లేటులోని చలిమంటవైపు చేతులు చాచిa చలి కాచుకుంటూ ఫన్నీగాగా స్నానం చేశాడు. ఈ వీడియోను ఐపీఎస్‌ అధికారి రూపిన్‌ శర్మ ట్విటర్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్‌ 'ఇది చన్నీటి ట్రిక్‌' అని కామెంట్‌ చేయగా.. మరొకరేమో 'భారతీయులను ట్రిక్స్‌లో ఎవరూ ఓడించలేరు' అని వ్యాఖ్యానించారు.

https://twitter.com/rupin1992/status/1480953018774261760?s=20