
ప్రజాశక్తి - పర్చూరు
చంద్రబాబు అక్రమ అరెస్టును నిరశిస్తూ స్థానిక టిడిపి కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విభిన్న ప్రతిభావంతులకు మోటారు బైకులు ఇచ్చి స్వతంత్రంగా గౌరవంగా జీవించే అవకాశాలు కల్పించారని అన్నారు. పెన్షన్‌ను రూ.3వేలు ఇచ్చినట్లు చెప్పారు.