Sep 15,2021 19:24

ప్రజాశక్తి - పెనుమంట్ర
సీనియర్‌ సిటిజన్‌ సంక్షేమ కార్పొరేషన్‌ ద్వారా విభిన్న ప్రతిభావంతులకు ట్రై సైకిళ్లు అందజేసినట్లు ఎంపిడిఒ ఆర్‌.విజయరాజు తెలిపారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద వైసిపి నాయకులు, గ్రామ సర్పంచి ఆధ్వర్యంలో ఎనిమిది మందికి ట్రై సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్రాహ్మణచెరువుకు చెందిన నాగమ్మ, సిహెచ్‌ సత్యవతికి, మార్టేరుకు చెందిన ఎం.నాగేంద్ర, జి.శ్రీనివాస్‌కు, ఆలమూరుకు చెందిన బి.ప్రసాద్‌, బి.దుర్గా భవానికి, మల్లిపూడికి చెందిన ఎ.శ్రీనివాస్‌కు, నెగ్గిపూడికి చెందిన ఎ.శాంతకుమారి అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ సత్తి విష్ణుకుమార్‌ రెడ్డి, వ్యవసాయ సలహామండలి కమిటీ ఛైర్మన్‌ కొవ్వూరి సూర్య రామకృష్ణ సత్యనారాయణ రెడ్డి (చిన్నారెడ్డి), సర్పంచులు టి.ప్రియాంక, దొంగ మహాలక్ష్మి, మేడపరెడ్డి వెంకటరమణ, మట్ట కుమారి, ఇఒపిఆర్‌డి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఉంగుటూరు: విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం నుంచి ఉపకరణాలు, సహాయ పరికరాల కోసం బుధవారం ఉంగుటూరులో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో 43 మంది దరఖాస్తులు చేసుకున్నారని ఎంపిడిఒ విజయలక్ష్మి వెల్లడించారు. ట్రై సైకిళ్లు 9, వీల్‌ ఛైర్స్‌ 7, హ్యాండ్‌ స్టిక్‌ 1, క్రెచ్స్ర్‌ 1, కృత్రిమ అవయవాలు 5, కాలిఫెర్స్‌ 3, హియరింగ్‌ ఎయిడ్స్‌ 7 మొత్తం 43 ఉపకరణాలు, పరికరాలను అవసరంగా గుర్తించామన్నారు. ప్రభుత్వం నుంచి మంజూరు కాగానే ఆయా పరికరాలను అందజేస్తామన్నారు.