Jul 29,2021 23:34

వినుకొండలో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-సత్తెనపల్లి : ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కా రం కోసం ఆంధ్ర ప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఎపిటిఎఫ్‌) ఆధ్వర్యంలో పలుచోట్ల గురువారం నిరసన ప్రదర్శనలు చేశారు. ఇందులో భాగంగా సత్తెనపల్లిలో జిల్లా కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు అధ్యక్షతన తాలూకా కేంద్రం వద్ద ప్రదర్శన, ధర్నా చేశారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ సిపిఎస్‌ రద్దుపై కాలయామపన సరికా దని, 6 డిఎలను విడుదల చేయాలని, పిఆర్‌సిని అమలు చేయాలని కోరారు. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా తెచ్చిన 172 సర్క్యులర్‌ను రద్దు చేయాలని, ఖాళీగా ఉన్న 23 వేల పాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, గురుకుల మోడల్‌ స్కూల్స్‌ కేజీబీవీ పాఠశాలల కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ టీచర్లను రెగ్యులర్‌ చేయాలని, ఎయిడెడ్‌ పాఠశాలల సిబ్బందికి హెల్త్‌ కార్డులు, మున్సిపల్‌ టీచర్లకు పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, డిమాండ్‌ చేశారు. పండిత పీఈటీ పోస్టులు అప్ర్‌గ్రేడ్‌ చేయాలన్నారు. అనంతరం తహశీల్దార్‌ రమణకుమారికి వినతిపత్రం ఇచ్చారు. మాచర్ల, వినుకొండ, పొన్నూరులోనూ ధర్నాలు చేశారు.