
ప్రజాశక్తి-చెరుకుపల్లి: పాఠశాలలలో బోధనా వసతులు, మౌలిక సదుపాయాలు పరిశీలించి సమాచారాన్ని పంపించాలని టీచ్ టూల్ రాష్ట్ర కోఆర్డినేటర్ తోట వీరయ్య సూచించారు. చెరుకుపల్లి భట్టి ప్రోలు మండలాల స్థాయి అబ్జర్వర్ల రివ్యూ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. గుల్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో టీచ్ టూల్ రాష్ట్ర కోఆర్డినేటర్ తోట వీరయ్య పాల్గొని ఉపాధ్యా యులకు పలు సూచనలు చేశారు. నెలాఖరు లోగా ఉపాధ్యాయులకు కేటాయించిన పాఠశాలల సమాచారాన్ని యాప్ ద్వారా అప్డేట్ చేయాలని సూచించారు. వీటి ద్వారా పాఠశాల లకు కావలసిన సమాచారాన్ని సేకరించడం ద్వారా పాఠశాలలో విద్యాబోధన, మౌలిక వసతులు మెరుగయ్యేందుకు తోడ్పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో చెరుకుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి శైలజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.