Apr 08,2021 23:31

పల్లవిని సన్మానిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌, డిఇఒ విఎస్‌ సుబ్బారావు

ప్రజాశక్తి-పొదిలిటౌన్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన పొదిలి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నలమారి పల్లవిని, బాలిక తల్లిదండ్రులను మంత్రి ఆదిమూలపు సురేష్‌, జిల్లా విద్యాశాఖాధికారి విఎస్‌ సుబ్బారావులు గురువారం సన్మానించారు. దేశ ప్రధానమంత్రితో ధైర్యంగా విద్యాసమస్యలను తీసుకువెళ్లడం ఎంతో అభినందనీమ యమని మంత్రి సురేష్‌ అన్నారు. కార్యక్రమంలో బాలిక తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావులు ఉన్నారు.