Mar 27,2023 20:30

విద్యార్థిని అభినందిస్తున్న డాక్టర్‌

విద్యార్థిని అభినందిస్తున్న డాక్టర్‌
విద్యార్థుల జీవితానికి దశాదిశా నిర్దేశం
నెల్లూరు:పదోతరగతి విద్యార్థుల జీవితానికి దశా దిశా నిర్దేశిస్తుందని డాక్టర్‌ కె.చిరంజీవి అన్నారు. సోమవారం బుజబుజ నెల్లూరు, డి.వి.ఎన్‌.ఎం.జెడ్పి హై స్కూల్లో, పిఎంపి ఆధ్వర్యంలో నిర్వహించిన సరస్వతి పూజా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలకు హాజరైయ్యే విద్యార్ధిని విద్యార్ధులకు సరస్వతి, విగేశ్వరుని పూజలు మనోధైర్యాన్ని నింపుతాయన్నారు. పదో తరగతి పరీక్షలు యువతీ యువకుల జీవితాలకు దిక్సూచి లాంటిదని, ఈసమయంలో ఉత్తీర్ణత కాదని, మంచి ర్యాంకు తెచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన కోరారు. పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకొని ఎందరో ఉన్నత స్థాయికి ఎదిగారని ఆయన పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో మంచి ఉద్యోగాలు ఉన్నాయని తెలియజేశారు
, ధనంతో సంబంధం లేకుండా చదువు ద్వారా లింకన్‌, అబ్దుల్‌ కలాం, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి లాంటి మహానుభావులు ఎందరో ప్రపంచ ఖ్యాతిని పొందారన్నారు. 29,25 డివిజన్‌ కార్పొరేటర్లు బద్దిపూడి గిరి, షేక్‌ సత్తార్‌ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని పి.ఎం.పి అసోసియేషన్‌ ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఎగ్జామ్‌ మెటీరియల్స్‌ అందజేయడం ఎంతో అభినందనీయమని కొనియాడరు. విద్యార్థులు తమలోని నైపుణ్యాలను ప్రదర్శించడానికి ప్రభుత్వ పాఠశాలలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం మెండుగా ఉంటుందన్నారు. బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా కాకుండా మనం పదిమందికి ఉపాధి కల్పించే విధంగా ఎదగాలన్నారు, జీవితంలో అందరికంటే ముందుండాలంటే పాఠశాల సమయానికి ముందు పాఠశాల విడిచిన తర్వాత మనం చేసే కషి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు, పరీక్షలు బాగా రాసి అందరూ ఉత్తీర్ణులు కావాలని ఆశీర్వదించారు, అనంతరం పిఎంపి ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన ప్యాడ్లు, పెన్నులు, పెన్సిల్లు, స్కేలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పి.ఎం.పి గౌరవాధ్యక్షులు అనుమల జయప్రకాష్‌, పాఠశాల హెచ్‌ఎం జాకీరా ఖానం, పాఠశాల వ్యవస్థాపకులు దూడల వెంకయ్య, ప్రసాద్‌ రావు, రూడ్స్‌ చైర్మన్‌ షేక్‌ రసూల్‌, పి.ఎం.పి అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్‌, డివిజన్‌ కార్యదర్శి దేవరకొండ శ్రీనివాసులు, విశ్రాంత ఆర్టిసి ఉద్యోగి యస్‌.సాయి, నగళ్ల రామకష్ణ, డి.సురేంద్ర, రమేష్‌, ఉపాధ్యాయులు అచ్యుత మణి తదితరులు పాల్గొన్నారు.