Jul 29,2021 22:27

విద్యాదీవెన మెగా చెక్కును అందజేస్తున్న మంత్రి శంకర నారాయణ, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌

అనంతపురం : పేద పిల్లలకు ఉన్నత విద్య అందించాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం వారికి బాసటగా నిలుస్తోందని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ పేర్కొన్నారు. లితాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి జగనన్న విద్యా దీవెన పథకం కింద 2020-2021 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండోవిడత కళాశాల ఫీజును అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతపురం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రితో పాటు ఎమ్మెల్సీలు మహమ్మద్‌ ఇక్బాల్‌, శమంతకమణి, ఎమ్మెల్యేలు ఉషాశ్రీ చరణ్‌, తిప్పేస్వామి, జొన్నలగడ్డ పద్మావతి, తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి, కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌, నగర మేయర్‌ వసీం, రాష్ట్ర నాటక అకాడమీ ఛైర్మన్‌ హరిత రాజగోపాల్‌, ఎడిసిసి బ్యాంకు ఛైర్మన్‌ లిఖిత, అహుడా ఛైర్మన్‌ మహాలక్ష్మి శ్రీనివాస్‌, జాయింట్‌ కలెక్టర్‌ గంగాధర్‌ గౌడ్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అణగారిన వర్గాలకు చెందిన నిరుపేద పిల్లలకు ఉన్నత విద్య అందించేందుకు వీలుగా జగనన్న విద్యా దీవెన పథకాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలో అణగారిన పేద పిల్లలు అందరూ కూడా ఇంగ్లీష్‌ మీడియం చదువులు చదవాలని, వారికి అన్ని రకాల మౌలిక వసతులు కలిగిన ప్రభుత్వ పాఠశాలలను అందుబాటులోకి తీసుకురావాలని భావించి నాడు-నేడు పథకం కింద రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అన్నింటిలో కూడా మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు చెప్పారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద రెండో విడత పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించేందుకు వీలుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేసినట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద రూ.53.92 కోట్ల మెగా చెక్కును మంత్రి, కలెక్టర్‌, ఎమ్మెల్యేలు అందజేశారు.
జిల్లాలో 83,095 మంది విద్యార్థులకు 53.92 కోట్ల లబ్ధి : కలెక్టర్‌
జిల్లాలో జగనన్న విద్యా దీవెన పథకం కింద 2020 - 21 సంవత్సరానికి సంబంధించి మొత్తం 92,345 మంది విద్యార్థులు అర్హత సాధించారని, వారికి సంబంధించి అర్హులైన 83,095 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.53.92 కోట్లను నేరుగా జమ చేసినట్లు కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ తెలిపారు. ఇందులో అందులో ఎస్సీ సంక్షేమం కింద 13,132 మంది విద్యార్థులకు రూ.7.41 కోట్లు, ఎస్టీ సంక్షేమం కింద 3,980 మందికి రూ.2.59 కోట్లు, బిసి సంక్షేమం కింద 42,574 మందికి రూ.26.40 కోట్లు, కాపు సంక్షేమం కింద 4,446 మందికి 3.08 కోట్లు, ఈబిసి కింద 11,357 మందికి రూ.9.84 కోట్లు, ముస్లిం మైనారిటీ కింద 7,488 మందికి రూ.4.53 కోట్లు, క్రిస్టియన్‌ మైనార్టీ కింద 118 మందికి 0.08 కోట్లును అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ డిడి యుగంధర్‌, సాంఘిక సంక్షేమ శాఖ డిడి విశ్వమోహన్‌ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ డిటిడబ్ల్యూఒ అన్నాదొర, బీసీ సంక్షేమశాఖ డిడి యుగంధర్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ పివివిఎస్‌.మూర్తి, వికలాంగుల సంక్షేమ శాఖ ఎడి రసూల్‌, నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ వాసంతి సాహిత్య, మాజీ ఎడిసిసి బ్యాంకు ఛైర్మన్‌ పామిడి వీరాంజనేయులు, విద్యార్థులు పాల్గొన్నారు.