
ప్రజాశక్తి-చీరాల: ఈ నెల 7వ తేదీన నెల్లూరులో జరిగిన విద్యార్థి విజ్ఞాన్ మంథన్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పేరాల హైస్కూల్ విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా సోమవారం పేరాల హైస్కూల్ ప్రాంగణంలో విద్యార్థులను హెచ్‌ఎం సాల్మన్, ఇతర ఉపాధ్యాయులు మెమెంటో, ప్రశంసా పత్రాలను అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం సాల్మన్ మాట్లాడుతూ వీవీఎం రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న పేరాల హైస్కూల్ 9వ తరగతి చదువుతున్న అచ్చుత సోమనాథ్, దిడ్ల మనోజ్ పాల్గొని హైస్కూల్ పేరును చాటారని అన్నారు. నెల్లూరులో ఆదివారం జరిగిన కార్య క్రమంలో పాల్గొన్న ఇరువురు చిన్నారులకు పాఠశాల ఉపాధ్యాయుల బృందం అభినందన లు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు బి సాల్మన్‌రాజు, గైడ్ ఉపాధ్యాయులు పవని భాను చంద్రమూర్తి, రాజేంద్రప్రసాద్, వై గాంధీ, చంద్ర శేఖర్, రమణారావు తదితరులు పాల్గొన్నారు.