Feb 24,2021 01:13

అధికారులు, హెచ్‌ఎంలతో సమీక్షిస్తున్న జెసి కీర్తి చేకూరి

ప్రజాశక్తి-కాకినాడ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో సజనాత్మకతను వెలికి తీసే విధంగా కార్యచరణ రూపొందిస్తున్నట్టు జెసి కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం జెసి, కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో డిఇఒ ఎస్‌.అబ్రహాం, ఎస్‌ఎస్‌ఎ పిఒ కె.విజయభాస్కర్‌తో కలసి పిల్లల్లోని సజనాత్మకతను పెంపొందించే విధంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి కీర్తి చేకూరి మాట్లాడుతూ పిల్లల్లో అపారమైన విజ్ఞాన సంపద దాగి ఉంటుందని దాన్ని వెలికి తీసే బాధ్యత వ్యవస్థపై ఉందని చెప్పారు. నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో విభిన్న పద్ధతుల్లో వారికి తగిన అభిరుచుల్లో సాంకేతికత నూతన ఆవిష్కరణలకు దారి తీస్తున్నాయన్నారు. ఇలాంటి ఆ విష్కరణలను విద్యాశాఖ గుర్తించవలసిన ఆవశ్యకత ఉందన్నారు. కేవలం పాఠ్యాంశాలు చెప్పామా, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారా అని కాక విద్యార్థుల్లో సజనాత్మకతను ఉపాధ్యాయులు గుర్తించాలన్నారు. అలాంటి విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా సమాజానికి దోపాదపడతారన్నారు. ఆ దిశగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు పని చేస్తే విద్యావ్యవస్థలో నూతన ఒరవడికి నాంది పలికిన వారవుతా రన్నారు. ఆ దిశగా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల్లో సజనాత్మకత ప్రోత్సహించే విధంగా ముందుకు రావాలని జెసికీర్తి చేకూరి పలు సూచనలు చేశారు.