Mar 01,2021 16:08

చెన్నై : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రచార వేగాన్ని పెంచారు. మూడు రోజుల పాటు తమిళనాడు పర్యటనలో భాగంగా.. ర్యాలీలు, సభలతో సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో రాహుల్‌గాంధీ సరదాగా స్టెప్పులేశారు. తమిళనాడులోని ములగుమూదుబ్న్‌ సెయింట్‌ జోసెఫ్స్‌ మెట్రిక్యులేషన్‌ విద్యార్థులతో కలిసి ఆడిపాడారు. పుష్‌-అప్స్‌, 'ఐకిడో' తో అక్కడి విద్యార్థులతో హుషారుగా గడిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే నాగర్‌కోయిల్‌ వెళ్లేటప్పుడు ఆచంగులం గ్రామ రహదారి వద్ద ఆగి, తాటి ముంజెలను ఆస్వాదిస్తూ అక్కడి ప్రజలతో ముచ్చటించారు. కాగా, సోమవారం కన్యాకుమారిలో ప్రచారం చేపట్టిన రాహుల్‌ భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమిళ ప్రజలు తప్ప మరెవరూ తమిళనాడును అభివృద్ధిలో నడపలేరు అని చరిత్ర చెబుతోందని, ఈ ఎన్నికల్లో కూడా ఇదే రుజువు కానుందని అన్నారు. తమిళనాడు ప్రజలకు వాస్తవంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారంటూ .. స్టాలిన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని చెప్పారు. తమిళనాడు సంస్కఅతిని కేంద్రం గౌరవించదని, ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి ప్రధాని మోడీకి ప్రతినిధి అని విమర్శించారు. ఆయన ఏం చెబితే అదే చేస్తారని, మోడీకి దాసోహం అనేవారు తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించలేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తమిళ సంస్కఅతిని ఆర్‌ఎస్‌ఎస్‌ అవమానించే అవకాశాన్ని ముఖ్యమంత్రి ఇవ్వకూడదని అన్నారు. ఒకే దేశం, ఒకే సంస్కఅతి, ఒకే చరిత్ర అని ప్రధాని చెబుతూ ఉంటారని, అటువంటప్పుడు తమిళం భారతీయ భాష కాదా? తమిళ చరిత్ర భారత చరిత్ర కాదా? అని ప్రశ్నించారు. ఒక భారతీయుడిగా తమిళ సంస్కఅతిని కాపాడడం తన విధి అని రాహుల్‌ గాంధీ అన్నారు. 

 విద్యార్థులతో ఆడిపాడిన రాహుల్‌గాంధీ