Sep 15,2021 21:59

విద్యాసామగ్రి వితరణ
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌:
తంబళ్ళపల్లి మండలంలోని తంబళ్ళపల్లి హరిజనవాడ ఎంపిపి పాఠశాల, గంగిరెడ్డిగారిపల్లె టిడబ్ల్యూ స్కూల్‌ నందు విద్యార్థులకు రిటైర్ట్‌ హెచ్‌ఎం జివి.ప్రసాద్‌ 50 మంది విద్యార్థులకు ఎంఇఓ త్యాగరాజు చేతుల మీదుగా విద్యాసామగ్రి, భోజనం ప్లేట్స్‌ను అందజేశారు. జివిప్రసాద్‌ మాట్లాడుతూ తాను సేవలందించిన పాఠశాలల విద్యార్థులకు విద్యాసామాగ్రిని అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు సత్యనారాయణరావు, పుష్పలత, ఈశ్వరమ్మ, సిఆర్‌పి బి.సుధాకర్‌, రమేష్‌రెడ్డి, వైసిపి నాయకులు శివయ్య పాల్గొన్నారు.