May 26,2023 23:42

ప్రజాశక్తి-అమలాపురం విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కామన ప్రభాకర్‌ మాట్లాడుతూ పెంచిన విద్యుత్‌ ఛార్జీలతో వినియోగదారులు అవస్థలకు గురవుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ధర మీద రెండు రెట్లు పెంచి దోపిడీ చేస్తున్నారని వెంటనే కేంద్రం ఇచ్చే ధర 2.70 పైసలు వసూలు చేయాలని డిమాండ్‌ చేశారు. ట్రూఅప్‌ ఛార్జీల వసూలుకూడా ఆపాలని డిమాండ్‌ చేశారు. పగలూ రాత్రీ ఏ విధమైన ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజలకు తెలియపరచకుండా కోతలు విధిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. జిల్లాలో విద్యుత్‌ శాఖ ఎస్‌ఇ కార్యాలయాన్ని ప్రారంభించి వినియోగదారులకు ఇబ్బందులేకుండా చూడాలని కోరారు. అనంతరం విద్యుత్‌ శాఖ ఎఇకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఒంటెద్దు బాబి, యార్లగడ్డ రవీంద్ర, ముషిణి రామకృష్ణ, మాచవరపు శివన్నారాయణ, ధోనిపాటి విజయలక్ష్మి, ములపర్తి మోహనవు, వడ్డి నాగేశ్వరరావు, గెడ్డం సురేష్‌ బాబు, డాక్టర్‌ దేవరపల్లి రాజేంద్ర బాబు, అప్పన శ్రీరామకష్ణ, చిలకపాటి శ్రీధర్‌, కుడిపూడి శ్రీను, ఎండి ఆరిఫ్‌, నెల్లి వెంకటరమణ, రాయుడు రమణ, దామిశెట్టి జయ, నిమ్మకాయల ప్రసాదు, పేరి శర్మ, తోపెల్ల సుబ్రమణ్యం, చవ్వాకుల రాము, పెచ్చెట్టి శివశంకర్‌, ముషిణి లక్ష్మణ్‌, అప్పారి శ్రీను, నీతిపూడి బాలసత్యనారాయణ, వాకపల్లి రాంబాబు, గెడ్డం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.