Oct 03,2022 22:50

యానాంలో ధర్నా చేస్తున్న విద్యుత్‌ శాఖ ఉద్యోగులు

- యానాంలో విద్యుత్‌ సమ్మెకు సిఐటియు మద్దతు
ప్రజాశక్తి- యానం
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ శాఖ ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ యానం విద్యుత్‌ శాఖ సిబ్బంది నిరవధిక నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో సోమ వారం విద్యుత్‌ శాఖ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిబిరం వద్ద ధర్నాకు సిఐటియు నాయకులు మద్దతు తెలి పారు. సిఐటియు నాయకులు జి.దుర్గాప్రసాద్‌ మాటా ్లడుతూ విద్యుత్‌ ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని దీనివల్ల దేశ వ్యాప్తంగా విద్యుత్‌ శాఖ ఉద్యోగులకు, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అంతేకాకుండా అధిక ఛార్జీలు చెల్లిం చడంవల్ల సామా న్యుల మీద సైతం భారం పడుతుందని కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల దేశం వెనక్కి పోతుందన్నారు. ఇప్పటికైనా ఉద్యోగుల ఆవేదన అర్థం చేసుకొని వారికి న్యాయం చేసే విధంగా కేంద్రం నడుచుకోవాలని పలువురు వ్యాఖ్యా నించారు. సభలో కె.వి.వి.సత్యనారాయణ మాటా ్లడుతూ మోడీ నిరంకుశ పాలనతో ప్రజలు విసిగి పోయారని, బీజేపీకి త్వరలో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిరక్షణ వేదిక కన్వీనర్‌ దాట్ల దేవదానంరాజు, ఈ నిరసన కార్య క్రమంలో సిఐటియు కన్వీనర్‌ కె.సత్యనారాయణ, విద్యుత్‌ శాఖ అధికారులు, టివి రాఘవరావు, ఎంవిఎస్‌ ఎన్‌ మూర్తి, పి శ్రీని వాసరావు, ఏం సింహాద్రి, దాసు, సిహెచ్‌ శంకర్‌ రెడ్డి, పీ.పురుషోత్తం విద్యుత్‌ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.