Feb 27,2021 01:18

ఆందోళన చేపడుతున్న సంఘం నేతలు

కలెక్టరేట్‌:శ్రీవంశీకృష్ణ (ఎస్‌వికె) షిప్పింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో తొలగించిన 13 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు నగర కార్యదర్శి డి.అప్పలరాజు డిమాండ్‌ చేశారు. శుక్రవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలగించిన కార్మికులను విధుల్లో పెట్టుకోవాలని లేబర్‌ కమిషనర్‌ ఆర్డర్‌ కూడా ఇచ్చారని తెలిపారు. అయినా యాజమాన్యం తీసుకోవడానికి సిద్ధంగా లేకపోవడం దుర్మార్గమన్నారు. తన కంపెనీ కార్మికులను సక్రమంగా చూడని వైసిపి నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేస్తూ, ప్రజలను ఏవిధంగా ఆదరిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే ఫుల్‌ అండ్‌ ఫైనల్‌ సెటిల్మెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అలా చేయకపోతే ఆయన కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్న వార్డులోకి తాము వచ్చి ప్రచారం నిర్వహించి, కార్మికులకు ఆయన చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు రాము, రమణ, గురువులు, సాంబ పాల్గొన్నారు.