Jul 29,2021 23:41

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు

ఎంవిపి కాలనీ : 2020-41 విఎంఆర్‌డిఎ మాస్టర్‌ ప్లాన్‌పై అభ్యంతరాలను జివిఎంసిలో సమర్పించామని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు తెలిపారు. గురువారం టిడిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. ఈ మాస్టర్‌ ప్లాన్‌తో నగరం విధ్వంసం అవుతుందన్నారు. 1989-2006 మాస్టర్‌ ప్లాన్‌లో ప్రతిపాదించిన రోడ్లలో ఇప్పటికి 10 శాతం రోడ్లు కూడా పూర్తి కాలేదని, మళ్లీ కొత్త రోడ్లను మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదించడం సరికాదన్నారు. ఈ విధంగా రోడ్ల నిర్మాణం చేపడితే వేల మంది పేద, మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది విఎంఆర్‌డిఎ చేసిన ప్లాన్‌ కాదని, విజయ సాయిరెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ అని ఎద్దేవాచేశారు.