Apr 07,2021 20:50

చిత్తూరు (కుప్పం) : చిత్తూరు జిల్లా కుప్పం మండలం గోణుగూరు సమీపంలోని పేటగుట్టపై ఉన్న శ్రీవళ్లీ సుబ్రహ్మణం స్వామి వార్ల విగ్రహాలను ధ్వంసం చేసిన కేసును 24 గంటల్లో ఛేదించినట్లు ఎస్‌పి సెంథిల్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మతిస్థితిమితం లేని ఒంటరి మహిళా జ్యోతి ఈ విగ్రహాలను ధ్వంసం చేసినట్లు గుర్తించామని తెలిపారు. జ్యోతి గత నాలుగేళ్లుగా గుడి పరిసరాల్లోనే తలదాచుకుంటోందని, తాగుడుకు బానిసై మద్యం మత్తులో విగ్రహాలను ధ్వంసం చేసిందని వివరించారు. వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు రాజకీయ నాయకులు వారి లబ్ధి కోసం ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ, పూజారుల సహకారంతోనే కేసును 24 గంటల్లో ఛేదించినట్లు తెలిపారు.