Jul 03,2022 23:44

పాలకొల్లు చెందిన యువకుడు మారేడుమిల్లిలో దుర్మరణం

పాలకొల్లు చెందిన యువకుడు మారేడుమిల్లిలో దుర్మరణం
ప్రజాశక్తి - పాలకొల్లు
మారేడుమిల్లి విహారయాత్రలో విషాదం నెలకొంది. పాలకొల్లు గజలక్ష్మి సెంటర్‌కు చెందిన 10 మంది యువకులు పాడేరు జిల్లా మారేడుమిల్లి విహార యాత్రకు వెళ్లారు. ఆ క్రమంలో జలపాతం వద్ద స్నానం చేస్తూ మంతెన రమేష్‌ అనే యువకుడు ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందాడు. దీంతో పాలకొల్లు గజలక్ష్మి సెంటర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సీతారామపురంలోని స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్‌ కళాశాలలో బిటెక్‌ ఈ ఏడాది పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరాల్సిన కొడుకు విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున మొత్తం 10 మంది స్నేహితులు మారేడుమిల్లి వెళ్లగా జలప్రవాహంకు ఇరువురు కొట్టుకుపోగా ఒకరిని రక్షించారు. రమేష్‌ మృతదేహాం లభించింది. మృతునికి తండ్రి లేరు. అక్క అనిత ఉద్యోగం చేస్తోంది.