
ప్రజాశక్తి-భట్టిప్రోలు: ప్రభుత్వ పథకాలు మొత్తం ప్రజలకు చేరువ చేసేది సచివాలయాల ద్వారానేనని, అక్కడి సిబ్బంది విజ్ఞతతో పనిచేయాలని ఎంపిడిఓ బి బాబురావు సూచించారు. మండలంలోని పెదపులివర్రు సచివాలయాన్ని గురువారం ఎంపిపి డివి లలితకుమారి, జెడ్పిటిసి టి ఉదరు భాస్కరిలతో కలిసి ఆయన తనిఖీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేవిధంగా చూడాలని కోరారు. ఎంపిపి లలితకుమారి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం అందుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న సచివాలయ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎస్ రాజశేఖర్ రెడ్డి, నాయకులు మల్లేశ్వరరావు, బాలాజీ తదితరులు ఉన్నారు.