
విజయనగరం : విజయనగరం 33 వ డివిజన్ కార్పొరేటర్ సిపిఎం అభ్యర్థి రెడ్డి శంకరరావు మంగళవారం ఉదయం ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రెడ్డి శంకరరావు మాట్లాడుతూ.. తనని గెలిపిస్తే డివిజన్‌ను ఆదర్శ డివిజన్‌గా అభివృద్ధి చేస్తానన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని, ఒక్కసారి అవకాశమిస్తే డివిజన్ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పోరాడుతామని చెప్పారు. కార్పొరేషన్లో ప్రజా సమస్యలపై వాణి వినిపిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం నాయకులు జగన్, బి.రమణ, సురేష్, బుచ్చయ్య, దుర్గయ్య, ప్రభాకర్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.