Nov 26,2021 11:25

విజయవాడ : రైతు ఉద్యమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని... రైతు సంఘాలు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నేడు విజయవాడలోని రైల్వే స్టేషన్‌ ప్రాంగణం నుండి ధర్నాచౌక వరకు ' రైతు ఉద్యమ వార్షికోత్సవ భారీ ప్రదర్శన ' నిర్వహించారు. డప్పులు, కోలాటం, కొమ్ముల శంఖారావం, రైతుల గేయాలు, నృత్యాలు, చిత్ర, విచిత్ర ప్రదర్శనల నడుమ ఉత్తేజంగా ర్యాలీ కొనసాగింది. ' నల్లచట్టాల రద్దు-రైతుకు తొలి పొద్దు ' అంటూ నల్లకుండను భుజంపై మోస్తూ వృద్ధ రైతన్న వినూత్న నిరసన తెలిపారు. ఎర్రజెండాలతో విజయవాడ రైల్వే ప్రాంగణమంతా ఎరుపెక్కింది. రైతు నేతల నినాదాలతో దద్దరిల్లింది. ఢిల్లీలో రైతు పోరాటంపై చిన్నారులు చేసిన ప్రదర్శన చూపరులందరినీ ఆకట్టుకుంది. రైతన్నల పోరాటాన్ని తెలుపుతూ విద్యార్థులు వేసిన వేషధారణలు వీక్షకులను ఆనందింపచేశాయి. మహిళల నృత్యాలు అలరించాయి. ఢిల్లీలో రైతాంగం చేసిన పోరాటం గురించి.. కళాకారులు చేసిన పలురకాల ప్రదర్శనలు ఆలోచింపచేసేవిగా, ఆకట్టుకునే విధంగా అలరించాయి. నేతలు మాట్లాడుతూ... అన్ని పంటల మద్దతు ధర గ్యారెంటీ చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు.

5

 

6

 

7

 

8

 

10

 

9

 

10

 

11

 

12

 

13

 

15

 

16

 

17

 

98

 

19