Jul 29,2021 12:45

విశాఖ : ఎట్టకేలకు విమాన సర్వీసులు పునఃప్రారంభమవుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విశాఖపట్నం-విజయవాడ మధ్య నిలిచిపోయిన విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఏడాది తరువాత పునఃప్రారంభమవుతున్న వాటిలో ఇండిగో సంస్థ విశాఖపట్నం-విజయవాడ మధ్య 74 సీట్ల సామర్థ్యం గల ఏటీఆర్‌ విమానం ఆగస్టు 1వ తేదీ నుండి నడపనుంది. ఇది వారంలో మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రతి మంగళ, గురు, శని, ఆదివారాల్లో మధాహ్నం 3.40 గంటలకు విజయవాడలో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం వస్తుంది. తిరిగి ఇక్కడి నుంచి సాయంత్రం 5.20 గంటలకు బయలుదేరి రాత్రి 6.25 గంటలకు చేరుతుంది.