Jul 28,2021 20:46

ముంబయి : ప్రముఖ ఇన్వెస్టర్‌, స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకుడు రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా విమానయాన రంగంలోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించారు. వచ్చే నాలుగేళ్లలో దేశంలో అతి తక్కువ ఖర్చుతో కూడిన విమానయాన సంస్థ కోసం 70 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.