May 13,2022 18:50

వినూత్న కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రం 'ఓడ విట్టి చుడలామా'. ఎవరివన్‌ ప్రొడక్షన్‌ పతాకంపై వినీత్‌ మోహన్‌, ప్రకాష్‌ వేలాయుధం కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. జీజేష్‌ ఎంవీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమీర్‌ సుహీల్‌, గోపిక అనే కొత్త నటులు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాతల్లో ఒకరైన వినీత్‌ మోహన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. వినూత్న కథ, కథనాలతో వినోదాన్ని మేళవించి ప్రతీకారం ప్రధానాంశంగా రూపొందిస్తున్న చిత్రమని దర్శకుడు తెలిపారు. త్వరలో చిత్ర ఆడియో ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి ప్రకాష్‌ వేలాయుధం ఛాయాగ్రహణం, అశ్విన్‌ శివ దాస్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.