Jan 14,2022 19:53

ఇటీవలే సుల్తాన్‌ చిత్రంతో మెప్పించిన కార్తీ మరో కథతో రెడీ అయ్యారు. తాజాగా ముత్తయ్య దర్శకత్వంలో అతడు నటిస్తున్న చిత్రం 'విరుమన్‌'. ఈ చిత్రంతో డైరెక్టర్‌ శంకర్‌ కుమార్తె అదితి శంకర్‌ హీరోయిన్‌గా కోలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. ఈ సినిమాను కార్తీ అన్నావదిన సూర్య, జ్యోతిక నిర్మిస్తుండడం విశేషం. సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు దర్శకుడు తెలిపారు. పోస్టర్‌ను రిలీజ్‌ చేసిన సూర్య అందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకొంటున్న 'విరుమన్‌' ఈ ఏడాది వేసవికి విడుదల కానుంది.