Jan 19,2022 11:08

విశాఖ : భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు బుధవారం ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. సీదిరి అప్పలరాజు, పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రి, గొలగాని హరి వెంకట కుమారి మేయర్‌, జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి, సిపి మనీష్‌ కుమార్‌ సిన్హా , డిఆర్‌ఎం అనూప్‌ కుమార్‌, సత్పతి హెచ్‌బిఎల్‌, తదితరులు రైల్వే స్టేషన్‌కు వెళ్లి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి సాదర స్వాగతం పలికారు.