
హైదరాబాద్ : టెక్నలాజీ స్టార్టప్ విస్టాన్ నెక్ట్స్ జెన్ మొట్టమొదటి దేశీయ తయారీ రోబో 'ఫ్లంకీ' డెవలపింగ్లోకి ప్రవేశించినట్లు తెలిపింది. కరోనా కారణంగా యాంత్రీకరణ అధికం కావడం నేపథ్యంలో సోషల్, సర్వీస్, పారిశ్రామిక ఉత్పత్తి రంగాలకు ఊతమిచ్చేలా రోబోల డిజైనింగ్, కస్టమైజింగ్ తయారీ, సరఫరాల నూతన దశలోకి అడుగు పెట్టామని విస్టాన్ నెక్ట్స్ జెన్ వ్యవస్థాపకులు రామరాజు సింగం తెలిపారు. మొదటిగా వ్యాపార, వినియోగదారు ఇంటర్ ఫేస్‌గా ఫ్లంకీని ఒక సర్వీస్ రోబోగా ప్రవేశపెడుతోన్నామన్నారు. ఒకే రకంగా కొనసాగే పనులు, తరచూ చేయాల్సి వచ్చే పనులు లాంటి వాటిల్లో మానవ ప్రమేయాన్ని తగ్గించాలనే ఆలోచనతో ఫ్లంకీని రూపొందించామన్నారు.