Jan 18,2022 18:40

రంగాపురంలో రంగయ్య అనే అతను ఉండేవాడు.అతను వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ ఉండేవాడు. అతను ఒక కుక్కను పెంచుతూ ఉండేవాడు. రంగయ్య ఇంటి దగ్గర ఉన్న చెట్టుపై రెండు కాకులు నివాసం ఉండేవి. ఆ కుక్కకు కాకులతో స్నేహం ఏర్పడింది. కుక్కకు రంగయ్య పెట్టిన ఆహారాన్ని అప్పుడప్పుడూ కాకులు కూడ వచ్చి కలిసి తినేవి. రంగయ్య చెరుకు తోటను వేసుకున్నాడు. తోటను ఒకనక్క వచ్చి పాడు చేస్తుండేది. ఎవరు పాడు చేస్తున్నారనే విషయం రంగయ్యకు అర్థం కాలేదు.
'నా అప్పులు ఎలా తీర్చాలి? లాభం వస్తే ఇల్లు కట్టుకోవాలనుకున్నాను. కానీ చెరుకు తోటను ఎవరో పాడు చేస్తున్నారు? ఎలా?' అని భార్యతో చెప్పి బాధపడ్డాడు. కాకులు, కుక్క, రంగయ్య బాధను చూసి 'మనల్ని రంగయ్య ఎన్నో రోజుల నుంచి ఆహారం పెట్టి మంచిగా చూసుకుంటున్నాడు. ఎలాగైనా మనం రంగయ్యకు సహాయపడాలి' అని కుక్క, కాకులు అనుకున్నాయి. కాకులు, కుక్క చెరుకు తోట దగ్గరకు వెళ్లాయి. తోట బయట చెట్టు మీద కాకులు, చెట్టు వెనుక కుక్క దాక్కొన్నాయి. నక్క చెరుకు తోటలోకి ప్రవేశించే సమయంలో అరుస్తూ నక్క మీద దాడిచేశాయి.ఆ సమయంలో అటుగా వచ్చిన రామయ్య ఆ సంఘటన చూశాడు.వాటి దెబ్బకి నక్క పరుగెత్తి పోయింది. మరుసటి రోజు నుంచి తోట చుట్టుపక్కలకు రాలేదు. కుక్కతో పాటు కాకులు కూడా సహాయపడినందుకు రామయ్య ఆనందపడ్డారు. అప్పటి నుంచి కుక్కతో సమానంగా కాకులకు కూడా ఆహారం వేయసాగాడు రామయ్య.

- సభావత్‌ చంటి,
9వ తరగతి, జెడ్పిహెచ్‌ఎస్‌, నేరెళ్ల పల్లి,
బాలానగర్‌ మండలం, మహబూబ్‌ నగర్‌ జిల్లా.