Jun 23,2022 18:39

విశ్వక్‌ సేన్‌ తాజా చిత్ర ప్రారంభోత్సవానికి పవన్‌ కళ్యాణ్‌ హాజరయ్యారు. విశ్వక్‌ సేన్‌ హీరోగా సీనియర్‌ నటుడు, దర్శకుడు అర్జున్‌ సర్జా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో అర్జున్‌ కూతురు.. ఐశ్వర్య అర్జున్‌ టాలీవుడ్‌ ఇండిస్టీకి హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. గురువారం ప్రారంభమైన ఈ చిత్ర ఫస్ట్‌ షాట్‌కి పవన్‌ కళ్యాణ్‌ క్లాప్‌ కొట్టి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు చెప్పారు. శ్రీరామ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెజీయఫ్‌ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం అందించనున్నారు. డైలాగ్స్‌ సాయి మాధవ్‌ బుర్రా, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా నీరజ కోన, లిరిసిస్ట్‌గా చంద్రబోస్‌, సినిమాటోగ్రాఫర్‌గా బాలమురుగన్‌ వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది.