Jan 21,2021 06:54

మేఘం గర్జిస్తే
ఉలిక్కి పడతావు
మెరుపులు చిట్లిస్తే
తల్లడిల్లిపోతావు
అతివృష్టి వలలో
చిక్కి శల్యమౌతావు
అనావృష్టి చీలికల్లో
ఇరుక్కుపోతావు
కష్టం నీదే
ఫలితం నీదే
పెత్తనం మాత్రం వాళ్ళది
చెమటను విదిలించి
నేలను తడుపుతావు
ఎముకలు విరుచుకుని
మొక్కను పెంచుతావు
బాగా నడుం వంచి
రాశిగా పోస్తావు
రసం లేని కాయలు
స్పృహ లేక పడుంటే
తట్టి లేపుతావు
భుజాలు అరిగేదాకా
అమ్మకానికి మోస్తావు
రేటు తేలిపోతే
తెల్ల మొహం పెడతావు
విత్తు నీదే
చెట్టు నీదే
బతుకు పోరాటంలో
అలసట కూడా నీదే
కానీ ఆజ్ఞాపన వాళ్ళది
ఏమిటి ఈ వింత అని
విత్తనం నవ్వింది.
                  * నరెద్దుల రాజారెడ్డి, సెల్‌ : 96660 16636