
ప్రజాశక్తి -భీమునిపట్నం : భావితరాలకు వివాద రహితంగా భూమి హక్కు పత్రాలను అందించాలన్నదే శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ఉద్దేశ్యమని స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. నాలుగోవార్డు, నిడిగట్టు సచివాలయం పరిధిలోని ఆర్వై.అగ్రహారం, నిడిగట్టు గ్రామాల్లో సమగ్ర భూసర్వే అనంతరం 334 మంది భూయజమానులకు తొలి విడతగా భూహక్కు పత్రాలు అందజేశారు. ఆర్‌డిఒ ఎస్ భాస్కరరెడ్డి, ఎఎంసి చైర్మన్ యలమంచిలి సూర్యనారాయణ, జోనల్ కమిషనర్ ఎస్ వెంకటరమణ, తహశీల్దార్ కోరాడ వేణుగోపాల్, ఎంఆర్ఐ మృధుల, విఆర్‌ఒలు పోతిన వెంకట అప్పారావు, ప్రసాద్ పాల్గొన్నారు.
ఆనందపురంలో
మండలంలోని కణమాంలో సమగ్ర భూసర్వే పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే ముత్తంశెట్టి రైతులకు అందజేశారు గ్రామంలో 987.091 ఎకరాలకు గాను, 621.60 ఎకరాలు సర్వే చేసి, 418మంది భూహక్కులను నిర్థారించి మొదటి విడతగా 150 మందికి పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె యస్.విశ్వనాథన్, భీమిలి ఆర్‌డిఒ భాస్కర్‌రెడ్డి, ఎంపిపి డాక్టర్ శారద ప్రియాంక, జెడ్పిటిసి కోరాడ వెంకటరావు, ఎంపిటిసి గొలగాని కృష్ణ, వైస్ ఎంపీపీ పాండ్రంకి.శ్రీను, సర్పంచ్ ఆబోతు అప్పల రాము, తహశీల్దార్ లోకవరపు. రామారావు, ఎంపిడిఒ లరాజు, డిటి రాజేష్, మండల సర్వేర్ బాలకష్ణ, ఆర్ఐ సాయి, కాకర్లపూడి శ్రీకాంత్, సింహాచలంనాయుడు, అప్పలనాయుడు గండేటి శ్రీనివాసరావు, బాలిరెడ్డి మహేష్ , గీతల జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు పలు సమస్యలపై ఎమ్మెల్యేకు విన్నవించారు.
పద్మనాభం : మండలంలోని బుడ్డివలస గ్రామంలో సమగ్ర భూసర్వే ఎల్పిఎం పాస్‌పుస్తకాలను ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసవు పంపిణీ చేశారు. బుడ్డివలస, బుడ్డివలస అగ్రహరం, చిన్నాపురం, తిమ్మాపురం గ్రామాల్లో 508 మందికి భూమిహక్కు పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల వైసిపి అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు, సర్పంచ్ చందక సూర్యనారాయణ, జెడ్పిటిసి సుంకర గిరిబాబు పాల్గొన్నారు.